ఉగాది నాడు తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలి: పవన్ కల్యాణ్

  • రేపు ఉగాది
  • ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
  • మన పండుగలన్నీ ప్రకృతితో పెనవేసుకున్నవేనని వెల్లడి
రేపు తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నిష్క్రమిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ప్రవేశిస్తోందని, ఈ శుభ ఘడియల్లో రైతులు, కార్మికులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.

ఉగాది నాడు తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలని ఆకాంక్షించారు. మన పండుగలన్నీ ప్రకృతితో పెనవేసుకున్నవేనని, అందుకే మన పండుగలకు అంత శోభ చేకూరుతుందని వివరించారు. సంక్రాంతి నాటికి పంట చేతికందితే, ఉగాదితో వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.

ఈ తెలుగు సంవత్సరం ప్రజలకు ఆరోగ్యం, సిరిసంపదలు ప్రసాదించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ముందస్తు సందేశం వెలువరించారు.

Pawan Kalyan
Ugadi
Telugu People
Andhra Pradesh
Telangana

More Telugu News